Thursday 4 December 2014

ఏపీ ప్రజలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు వరం ప్రకటించారు:

రైతులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రుణమాఫీ విధివిధానాలను ఆయన గురువారం ఉదయం ప్రకటించారు. రుణమాఫీకి అర్హుల జాబితా అన్‌లైన్‌లో ఉంచుతామని ప్రకటించారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రేషన్ కార్డు ఇవ్వని వారు, ఆథార్ ఇవ్వనివారు, ల్యాండ్ రికార్డు ఇవ్వని రైతులు చాలా మంది ఉన్నారని అన్ని కార్డులు ఉన్న వారికి తొలి విడతలో రుణమాఫీ చేస్తున్నామని ప్రకటించారు. చంద్రబాబు రుణమాఫీ ప్రకటనతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రుణమాఫీ డీటైల్స్ ఇలా ఉన్నాయి.

- ఈ నెల 10 నుంచి రూ.50 వేల లోపు రుణాలన్ని మాఫీ
- డిసెంబర్ 6న రుణముక్తి దారుల తొలి జాబితా
- అభ్యంతరాల స్వీకరణకు 9న గ్రీన్‌సెల్.. కాల్ సెంటర్ ఏర్పాటు
- జనవరి 22 లోగా రెండో విడత జాబితా ప్రకటన
- అన్ని బ్యాంకుల్లో కలిపి మొత్తం 82 లక్షల 66 వేల రుణాలు ఉన్నాయి.
- 22 లక్షల 79 వేల కుటుంబాలకు తొలి విడతలో రుణమాఫీ.
- 40 లక్షల 43 వేల రుణాలకు మాఫీ వర్తింపు
- వడ్డీతో కలిపి రూ 1.5 లక్షల రుణం మాఫీ(కుటుంబానికి సీలింగ్)
- హర్టికల్చర్ రైతులకు త్వరలో రుణమాఫీ చేస్తాం.
- ఈ సంవత్సరం జనవరి 1 నుంచి రుణాలు చెల్లించిన రైతులకు కూడా రుణమాఫీ
- రుణమాఫీకి రేషన్ కార్డు లేకుంటే ఓటరు కార్డును ఆధారంగా తీసుకుంటారు.
- రాష్ట్రంలో ప్రస్తుతం రూ.16 వేల కోట్ల ఆర్థికలోటు ఉన్నట్టు ప్రకటించారు.
- ఒకే సర్వే నెంబర్‌లో యజమాని, కౌలు రైతు ఇద్దరు రుణం తీసుకుంటే కౌలు రైతుకే రుణమాఫీ చేస్తారు.
- 1-4-2007 నుంచి 31-12-2013 వరకు రుణాలు తీసుకున్న వారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది.
- రేషన్‌కార్డులు లేకపోతే జన్మభూమి కమిటీ ద్వారా రుణమాఫీ చేస్తారు.
- రూ.50వేల లోపు రుణాలకు స్కేల్ఆఫ్ ఫైనాన్స్ వర్తించదన్నారు.
- ఒకే కుటుంబంలో నలుగురు రూ.లక్షన్నర కంటే ఎక్కువ రుణం తీసుకుంటే ప్రొడేటా ప్రకారం రుణమాఫీ చేస్తామన్నారు.