Tuesday 4 November 2014


ఎవరికో పుట్టిన పిల్లలకు తాము నామకరణం చేసే సంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తోంది. కాంగ్రెస్ పాలనలో.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైన పథకాలకు పేర్లు మార్చి తమకు ఇష్టమైన పేర్లను పెట్టుకొనే సంప్రదాయాన్ని తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ వంటి  సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ పేరు, తెలుగుదేశం పార్టీ పేరు కలిసి వచ్చేలా పెట్టుకొన్న ప్రభుత్వం ఇప్పుడు పల్లె వెలుగు బస్సులపై కూడా దృష్టి సారించింది! గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యాన్ని కల్పిస్తూ వైఎస్సార్ హయాంలో "పల్లెవెలుగు' ల ప్రస్థానం మొదలైంది. ప్రత్యేకమైన రంగుల్లో పల్లెవెలుగు లోగోతో ఆర్టీసీ బస్సులనే పల్లెలకు పంపారు. గ్రామీణ ప్రజల రవాణా అవసరాలను తీర్చే ఈ బస్సులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఈ గుర్తింపును తమకు అనుకూలంగా మార్చుకొనే యత్నం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. "పల్లె వెలుగు'' బస్సుల పేర్లను మార్చాలని... వాటికి పసుపు రంగు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీ రంగును ఈ బస్సులకు పట్టిస్తే.. వాటి ద్వారా తమకు క్రెడిట్ వస్తుందని ప్రభుత్వ మేధావులు భావిస్తున్నట్టుగా ఉన్నారు.
Next
Newer Post
Previous
This is the last post.