Thursday 20 November 2014

దోసకాయ పచ్చడి కావలసినవి:
దోసకాయలు (పెద్దవి) - 2
నూనె - 6 టీ స్పూన్లు
పచ్చిమిర్చి - 6
ఎండుమిర్చి - 10
ఆవాలు - 2 టీ స్పూన్లు
జీలకర్ర - టీ స్పూను
మినప్పప్పు - 3 టీ స్పూన్లు
పచ్చిశనగపప్పు - 2 టీ స్పూన్లు
పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత,
చింతపండు - కొద్దిగా (నానబెట్టినది),
కొత్తిమీర - కొద్దిగా, బెల్లం - కొద్దిగా (రుచిని బట్టి)



దోసకాయ పచ్చడి తయారి:
దోసకాయలను స్టౌ మీద కాల్చి, చల్లారాక పొట్టు తీయాలి.బాణలిలో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేగాక, ఎండుమిర్చి వేసి మరోమారు వేయించి దించేయాలి. చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. దోసకాయగుజ్జు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.